Sunday, October 17, 2010

ఏ రంగుల హంగుల పొడ లేదురా...!

మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు రాయంచ సనునె తరంగిణులకు
లలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే కుటజములకు
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు
పోతన వ్యక్తిత్వాన్ని ఈ పద్యం పట్టిచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఎంతో లలితంగా సరళంగా తన వాదనని జీవిత పరమార్ధ లక్ష్యాన్ని చెప్పేస్తాడు పోతన.ఏ రంగుల హంగుల పొడ లేదురా అనిపిస్తుంది.